ETV Bharat / state

జగిత్యాల జిల్లాలో జోరుగా బియ్యం పంపిణీ

జగిత్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో బియ్యం సరఫరా జోరుగా సాగుతోంది. మొదటి రోజు కొన్ని ఏరియాల్లో పంపిణీ జరగలేదు. ఫలితంగా నేడు ఆయా కేంద్రాల ద్వారా పంపిణీ జరుగుతోంది. లబ్ధిదారులందరికీ బియ్యం అందిస్తామని.. ఒకే సారి గుంపుగా రాకూడదని అధికారులు సూచించారు.

అర్హులందరికీ బియ్యం అందిస్తాం...ఆందోళన వద్దు : అధికారులు

author img

By

Published : Apr 2, 2020, 12:21 PM IST

జగిత్యాల జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా ఉచిత బియ్యం పంపిణీ ఊపందుకుంది. జిల్లాలోని 380 గ్రామ పంచాయతీలతో పాటు, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ పురపాలికల పరిధిలో పంపిణీ కొనసాగుతోంది. తొలిరోజు కొన్ని ప్రాంతాల్లో బియ్యం పంపిణీ ప్రారంభమైనప్పటికీ... ఏర్పాట్లలో జాప్యం జరిగింది. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో నేటి నుంచి పంపిణీ ప్రారంభించారు. ఉదయం 30 మందికి, సాయంత్రం 30 మందికి బియ్యాన్ని అందజేస్తున్నారు. లబ్ధిదారులు భౌతిక దూరం పాటించేలా డబ్బాలు గీశారు. ఒకేసారి గుంపులా రాకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

లబ్ధిదారులందరికీ బియ్యం...ఆందోళన వద్దు

ప్రతి లబ్ధిదారుడికి బియ్యం పంపిణీ జరిగే వరకు రేషన్‌ దుకాణాలు తెరిచే ఉంచుతారని పౌర సరఫర శాఖ అధికారులు వెల్లడించారు. లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదని స్పష్టం చేశారు. బియ్యం పంపిణీపై జగిత్యాల జిల్లా కలెక్టర్‌ రవి, అదనపు కలెక్టర్‌ బి. రాజేశం సమీక్షిస్తున్నారు. ఉచితంగానే బియ్యం పొందాలని, ఎవరు డబ్బులు చెల్లించనక్కరలేదని తెలిపారు. పంపిణీలో ఎవరైనా... అవినీతికి పాల్పడితే గట్టి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హెచ్చరించారు.

ఇవీ చూడండి : వైద్యులపై దాడి హేయమైంది.. చర్యలు తప్పవు: ఈటల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.