జగిత్యాల జిల్లాలో ఐకేపీ మహిళలు, సహకార సంఘ సిబ్బంది, రైస్ మిల్లర్ల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్ డాక్టర్ శరత్ సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ ఖరీఫ్‌లో ఆరున్నర లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 360 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మిల్లర్లు సైతం లారీలను ఆలస్యం చేయకుండా ధాన్యంను దించుకోవాలని, రైతులకు కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తేమశాతం 17 ఉండేలా చూడాలని, వర్షాలు వస్తే టార్ఫలిన్ షీట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. ఈసారి కాల్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో రైతన్న కష్టాలు