జగిత్యాల జిల్లాలో నిర్వహించిన ప్రజావాణికి పలుప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై జిల్లా పాలనాధికారి డాక్టర్ శరత్‌కు వినతిపత్రాలు అందజేశారు. భూసమస్యలు, రైతు భీమా, ఫించన్ సమస్యలపై ఎక్కువగా ఆర్జీలు అందజేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ రాజేశం పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ఆ విషయంలో జోక్యం చేసుకోలేం: సుప్రీం కోర్టు