జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏఎస్‌ఐ వెంకటేశ్వర్‌రావు శిరస్త్రాణం లేకుండా వెళుతున్న చిత్రాన్ని తీసి కొందరు యువకులు సామాజిక మధ్యమాల్లో పెట్టారు. మీకు లేవా రూల్స్ అంటూ ఫేస్బుక్ ద్వారా ప్రశ్నించారు. స్పందించిన జిల్లా ఎస్పీ సింధూ శర్మ వెంటనే ఈ చలాన్ ద్వారా రూ.135లు జరిమానా విధించారు. జగిత్యాల పోలీసులు తీసుకున్న ఈ చర్యతో స్థానికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
ఇవీ చూడండి: స్వచ్ఛందసంస్థ స్థాపకుడి నుంచి సివిల్స్ర్యాంకర్గా..!