ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటించాలని మెట్పల్లి పురపాలిక ఛైర్పర్సన్ సుజాత పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలిక పరిధిలోని పలు వార్డుల్లో అధికారులు పట్టణప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలు వార్డుల్లో పర్యటించిన ఆమె.. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు పలు సూచనలు చేశారు. వార్డుల్లో పారిశుద్ధ్య సమస్యలతో పాటు తాగునీరు, విద్యుత్ లాంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం రూపొందించాలని తెలిపారు.