క్వింటా పసుపు 15 వేలు మద్దతు ధర ప్రకటించాలని కోరుతూ... జగిత్యాలలో పసుపు రైతులు కదం తొక్కారు. వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన అన్నదాతలు పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర సాగించారు. అనంతరం కలెక్టరేట్‌ను ముట్టడించి ఆందోళన నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రెండు గంటలపాటు ఆందోళన చేశారు.
పంటకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతన్నలు వాపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర ప్రకటించినప్పుడే తమకు గిట్టుబాటు అవుతుందని రైతులు పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ప్రైవేటు ఆస్పత్రికి కరోనా సోకిన ఇటలీ పర్యటకులు