జగిత్యాల జిల్లా ధరూర్ గ్రామంలో భూ తగాదాల కారణంగా రెండు వర్గాలు వారు ఘర్షణకు దిగారు. పరస్పరం తిట్టుకుంటూ కత్తితో దాడి చేసుకునే వరకు వెళ్లారు. ఈ క్రమంలో బక్కశెట్టి గంగారెడ్డి, అతని కొడుకు సతీష్‌ను ఇరుశెట్టి రాజేశ్ అనే వ్యక్తి కత్తితో పొడిచాడు.
తీవ్రంగా గాయపడిన గంగారెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. సతీష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: గ్రేటర్లో కొత్త ప్రాంతాల్లో పెరుగుతున్న కొవిడ్ కేసులు