కాళేశ్వరం పథకం... వరద కాలువపై నిర్మిస్తున్న పునరుజ్జీవ పథకంలో భాగంగా జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వద్ద నిర్మించిన రివర్స్ పంపింగ్ పనుల్లో నిర్వహించిన వెట్‌రన్ రెండో రోజు సైతం కొనసాగింది. నాలుగు మోటార్లను ఒకేసారి గంటపాటు నడిపారు. ట్రయల్‌రన్‌లో రెండోరోజు కూడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకపోవడం పట్ల ఇంజినీర్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాంపూర్ వద్ద మొత్తం 8 మోటర్లకు గానూ 5 మోటర్లను ఇంజినీర్లు సిద్ధం చేశారు.
ఇవీ చూడండి : రికార్డు: 73 ఏళ్ల బామ్మకు కవల పిల్లలు