ETV Bharat / state

'పోతారం చెరువు మత్తడి నిర్మాణాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది' - jagitial district news

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పోతారం చెరువును​ కాంగ్రెస్​ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యంతో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సందర్శించారు. ఇటీవల ప్రారంభించిన పోతారం పంప్​హౌస్ వద్ద మత్తడి కొట్టుకు పోయిన స్థలాన్ని పరిశీలించారు. చెరువు మత్తడి నిర్మాణాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన విమర్శించారు

mlc jeevanreddy visit potharam lake in jagitial district
'పోతారం చెరువు మత్తడి నిర్మాణాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది'
author img

By

Published : Aug 13, 2020, 9:19 PM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పోతారం చెరువు మత్తడి నిర్మాణాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యంతో కలిసి ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి పోతారం చెరువును సందర్శించారు.

పంప్​హౌస్​కు నీరు చేరక పోవటం వల్ల రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పనులు చేపట్టారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా రాబోయే దసరా పండగ వరకు పోతారం చెరువు మత్తడి శాశ్వత నిర్మాణం చేపట్టాలని కోరారు. వెనుకబడిన కొడిమ్యాల మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.

ఇవీ చూడండి: సొంతపార్టీ నేతల తీరుపై వీహెచ్ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.