తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లాలోని కోరుట్ల తెరాస కార్యాలయం సమీపంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ పూలమాల వేశారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. ప్రజలందరూ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఇవీ చూడండి: బంగారు తెలంగాణ లక్ష్యంగా సంస్కరణలు