జగిత్యాల పట్టణంలోని 15 వార్డులో రూ.65 లక్షలతో నిర్మించే పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ నిధులతో డ్రైనేజీల నిర్మాణాలు, తదితర పనులు చేపట్టనున్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఆయన ఆరా తీశారు. రైతులకు ఇబ్బంది కలగకుండా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులతో మాట్లాడిన ఆయన... చివరి గింజ వరకు కొంటామని హామీ ఇచ్చారు. ఆందోళన అవసరం లేదని అన్నారు.
పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే రూ.50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. మిగిలిన పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఇదీ చదవండి: గ్రామాల్లో విరుచుకుపడుతున్న కొవిడ్ వైరస్