సమస్యలు లేని పట్టణాలను తీర్చిదిద్దడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 23 వార్డులో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పట్టణాల్లో ఉన్న సమస్యలు, పారిశుద్ధ్య నిర్వహణ ఈ కార్యక్రమం ద్వారా విజయవంతం అవుతాయని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పట్టణ ప్రగతిలో భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ రవి, పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: కార్మికుల కృషితోనే తొలిస్థానంలో కరీంనగర్: సునీల్‌రావు