కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా దివ్యాంగులకు లక్షా 25వేల 116 రూపాయలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా బుగ్గారం, గొల్లపల్లి, పెగడపల్లి మండలాల్లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాల్లో మీసేవ కేంద్రాలను ప్రారంభించారు. కల్యాణలక్ష్మి పథకం ద్వారా బాల్య వివాహాలు తగ్గతాయని తెలిపారు. మంచి చేసే ప్రజాప్రతినిధులకు ధైర్యాన్ని అందిస్తే...మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
ఇదీ చూడండి: పద్దు 2019: బడ్జెట్ సూట్కేస్ చరిత్ర తెలుసా?