జగిత్యాలలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పేలింది. భారీగా మంటలు చెలరేగడంతో అగ్ని మాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఒక్కసారిగా శబ్ధం రావటంతో వసతి గృహంలోని విద్యార్థునులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. అధికారులను అడిగి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. వసతి గృహం, పాఠశాల రెండూ ఒకే భవనంలో ఉండటం వల్ల ఇరుకుగా ఉందని విద్యార్థినులు మంత్రికి వివవరించారు.
ఇదీ చూడండి: భూవివాదంతో వ్యక్తి దారుణ హత్య