తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు జగిత్యాల కలెక్టరేట్‌ను ముట్టడించారు. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి తరలి వచ్చిన సిబ్బంది ఆందోళన చేశారు. సర్క్యులర్ 4779ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల కనీస వేతనం రూ. 21 వేలకు పెంచాలని కోరారు. అనంతరం ప్రజావాణిలో సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.