ETV Bharat / state

పౌష్టికంపై పట్టు.. ఆరోగ్యానికి మెట్టు

author img

By

Published : Dec 17, 2020, 2:54 PM IST

మారుతున్న కాలంతోపాటు మానవ జీవనశైలి మారుతోంది... మధుమేహం, రక్తపోటు, రక్తహీనతల సమస్యలు అన్ని వర్గాల ప్రజల్ని ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రసవాల్లో సిజేరియన్లు అధికంగా ఉంటున్నాయి. పౌష్టికాహారంతో కూడిన ఆరోగ్యాన్ని అందుకునేందుకు ప్రతి ఒక్కరు అడుగులేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కనిపిస్తోంది.

Malnutrition in the people of joint Karimnagar district
పౌష్టికంపై పట్టు.. ఆరోగ్యానికి మెట్టు

తాజాగా విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5లోని సారం తీరుని గమనిస్తే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని.. నాలుగు జిల్లాల పరిధిలో భిన్నమైన వ్యత్యాసాలు స్పష్టమవుతున్నాయి. ఆరోగ్యపరమైన భవితను అందుకోవాలంటే మార్పుతో కూడిన జీవనాన్ని అలవర్చుకోవాలనే విషయాన్ని ఈ సర్వే తేటతెల్లం చేస్తోంది. 2019లో జూన్‌ 30వ తేదీ నుంచి నవంబరు 14వ తేదీ వరకు సర్వే బృందం సభ్యులు నాలుగు జిల్లాల్లో పర్యటించారు. అవసరమైన సమాచారాన్ని సేకరించారు.

అగ్రస్థానంలో కరీంనగర్‌..

నాలుగు జిల్లాల పరిధిలో ప్రసవాల పరంగా శస్త్రచికిత్సల జోరే అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 60.7 శాతం సగటున సిజేరియన్లు జరుగుతుండగా.. కరీంనగర్‌ జిల్లానే రాష్ట్రస్థాయిలో అగ్రగామి అనే తీరు ప్రస్ఫుటమవుతోంది. కరీంనగర్‌ జిల్లాలో 82.4 శాతం మందికి సిజేరియన్‌ చేస్తున్నారు. ఇక్కడ అత్యధికంగా ప్రైవేటు ఆస్పత్రిలో 92.8 శాతం ప్రసవాల్లో ఇదే పంథాను అవలంబిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రిల్లోనే తామేమి తక్కువ కాదనేలా 66.8 శాతాన్ని ఈ విషయంలో చూపిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో సిజేరియన్లు (68.1) ఇందులో ప్రైవేటులో 77.4 శాతం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 64.9శాతం, పెద్దపల్లి జిల్లాలో 71.6 శాతం, ప్రైవేటులో 88.8శాతం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 58.2 శాతం, సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే 77.2శాతం జరుగుతున్నాయి. ఇందులో ప్రైవేటులో 90.9శాతం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 60.6 శాతం శస్త్రచికిత్సల తీరుంది.

వ్యత్యాసం అధికమే..!

ఆయా జిల్లాల్లో ప్రతి వెయ్యిమంది పురుషులకు, స్త్రీల సంఖ్యనే అధికంగా ఉంటోంది. ఇందులో రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాలో అత్యధికమనే తీరు కనిపిస్తోంది. ఇక్కడ అన్ని వయస్సుల మగ, మహిళల నిష్పత్తి 1000:1219గా ఉంది. పెద్దపల్లిలో తక్కువగా (1000:1028) ఉండగా..గడిచిన ఐదేళ్లలో పుట్టిన వారిలో మాత్రం మహిళల సంఖ్య తగ్గుతుండటం కలవరపరిచే విషయం. ఒక్క సిరిసిల్ల జిల్లాలో మాత్రం ప్రతి వెయ్యిమంది బాలురకుగానే 1115 మంది బాలికలు జన్మించగా.. జగిత్యాల (955), కరీంనగర్‌ (933), పెద్దపల్లి (913)జిల్లాలో వెయ్యిలోపు ఉండటం ఆందోళనను పెంచుతోంది.

పిల్లల్లో రక్తహీనత

6 నుంచి 59 నెలల పిల్లల్లో జగిత్యాల జిల్లాలో 59.9శాతం మందికి రక్తహీనత లోపం ఉండటం ఆందోళన కలిగించే విషయం. ఇలాగే కరీంనగర్‌ (70.8) పెద్దపల్లి (69.6), సిరిసిల్లలో (65.7) శాతం ఉండగా.. 15-49 ఏళ్లలోపు మహిళల్లో జగిత్యాల (56.3), కరీంనగర్‌ (61.1), పెద్దపల్లి (64.6), సిరిసిల్ల (56.0), 15-19 ఏళ్లలోపు మగవారిలో (66.2), కరీంనగర్‌ (73.2), పెద్దపల్లి (78.3), సిరిసిల జిల్లాల్లో 61.4 శాతం ఉన్నారు. సరైన పౌష్టికాహారాన్ని తీసుకుంటే ఈ ఇబ్బందిలో మార్పు కనిపించే వీలుంటుంది.

మధుమేహం

మహిళల్లో సగటున జగిత్యాలలో 7.5శాతం మందిలో పురుషుల్లో 8.6శాతం మందిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్‌ జిల్లాలో మహిళల్లో 6.2, పురుషుల్లో 6.6, పెద్దపల్లి జిల్లాలో అతివల్లో 4.2, పురుషుల్లో 7.3, సిరిసిల్ల జిల్లాలో మహిళల్లో 6.5 మగవారిలో 6.2శాతం ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి.

రక్తపోటు

జగిత్యాల జిల్లాలో మహిళల్లో 11.9 శాతం, మగవారిలో 16.4శాతం రక్తపోటు ప్రభావం ఉన్నట్లు తేలింది. కరీంనగర్‌లో మహిళల్లో 11.8, పురుషుల్లో 19.5, పెద్దపల్లిలో మహిళల్లో 13.4, మగవారిలో 21.8, సిరిసిల్ల జిల్లాలో అతివల్లో 6.5, పురుషుల్లో 6.2 శాతం ఈ రుగ్మత లక్షణాలు ఇంతకింతకు పెరుగుతుండటం ఆందోళనను పెంచుతోంది.

బడికెళ్తున్నారు..

గతంతో పోలిస్తే చిన్నారులు బడిబాట పట్టే విషయంలో ఉమ్మడి జిల్లా ఆదర్శంగానే నిలుస్తోంది. ఆరేళ్లలోపు బాలికల్లో జగిత్యాల (55.9), కరీంనగర్‌ (63.6), పెద్దపల్లి (61.3), సిరిసిల్ల జిల్లాలో 56.4శాతం మంది వెళ్తున్నారు. అదే ఐదేళ్లలోపు వాళ్లు 2019-20 ఏడాదిలో జగిత్యాల (6.2), కరీంనగర్‌ (16.4), పెద్దపల్లి (12.5), సిరిసిల్లజిల్లాలో 9.1 శాతం వెళ్లగలిగారు. ఆయా జిల్లాల్లో మొత్తం జనాభాలో 15 ఏళ్లలోపు వయస్సువారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.