ETV Bharat / state

ఘనంగా మల్లన్న జాతర... కిక్కిరిసిన ఆలయం - ఘనంగా మల్లన్న జాతర... కిక్కిరిసిన ఆలయం

జగిత్యాల జిల్లాలో మల్లన్న జాతర ఘనంగా నిర్వహించారు. సుమారు 30వేల మంది స్వామికి బోనాలు సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఘనంగా మల్లన్న జాతర... కిక్కిరిసిన ఆలయం
author img

By

Published : Mar 24, 2019, 10:00 PM IST

ఘనంగా మల్లన్న జాతర... కిక్కిరిసిన ఆలయం
జగిత్యాల జిల్లా మెట్​పల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో మల్లన్న స్వామి బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా కామదహనం తర్వాత వచ్చే మొదటి ఆదివారం రోజున ఈ వేడుక జరుపుకుంటారు.

ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్​, నిజామాబాద్​, ఆదిలాబాద్​, వరంగల్​ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. అంతేకాదు పక్కనే ఉన్న మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి... భక్తి శ్రద్ధలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

ఆలయ ప్రాంగణంలోకి భక్తులంతా... బోనాలు ఎత్తుకుని రాగా ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీగా భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇవీ చూడండి: నెలరోజులుగా ముప్పుతిప్పలు పెడుతోన్న చిరుత

Intro:hyd--tg--VKB--45--24--TRS Meeting--ab--C21

యాంకర్: అభివృద్ధి చేస్తా అందరికి అందుబాటులో ఉంటా నని చేవెళ్ల పార్లమెంట్ నియోజక వర్గ టీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.

Body:1.వాయిస్ : వికారాబాద్ జిల్లా వికారాబాద్ లోని గౌలికార్ ఫంక్షన్ హాల్ లో జరిగిన నియోజక వర్గ కార్యకర్తలు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అంతకు ముందు పార్టీ జెండా ను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ , తాను ఎంపిగా గెలిస్తే అనంతగిరి ని పర్యటక కేంద్రం గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. జోగులాంబా జోన్ ఉన్న వికారాబాద్ ను చార్మినార్ జోన్ లోకి మారుస్తామని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పూర్తి చేస్తామని తెలిపారు ఆయన రాక ముందు సమావేశ విషయం తమకు చెప్పలేదని మోమిన్ పేట మండలం ఎన్కతల కార్యకర్తలు నాయకులతో వాగ్వివాదానికి దిగారు. కొంత సేపు సమావేశంలో గందరగోళం నెలకొంది.
బైట్ : డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ( చేవెళ్ళ ఎంపీ అభ్యర్థి )

Conclusion:మురళీకృష్ణ , వికారాబాద్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.