జగిత్యాల జిల్లా కోరుట్ల శ్రీ స్వయంభు సిద్ధి వినాయక దేవాలయంలో గణనాథునికి లక్ష పుష్పార్చన నిర్వహించారు. శ్రావణ మాసంలో విశిష్టమైన సంకట హర చతుర్థిని పురస్కరించుకొని ప్రత్యేక వేదిన ఏర్పాటు చేసి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గణపతికి మరియు శివలింగానికి సామూహిక పంచామృతాభిషేకంతో పాటు మహిళలచే శివ ముష్టి వ్రతాలు నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఇదీ చూడండి: భూవివాదంతో వ్యక్తి దారుణ హత్య