ETV Bharat / state

అధికారుల పర్యవేక్షణ లోపం.. నర్సరీల్లో మొలకెత్తని విత్తనాలు - తెలంగాణ వార్తలు

హరితహారం కోసం చేపట్టిన నర్సరీలు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారాయి. అధికారుల పర్యవేక్షణలోపంతో 35 శాతం విత్తనాలు మొలకెత్తలేదు. లక్షలు ఖర్చు చేసినా ఫలితం అంతంతమాత్రంగానే ఉంది. అందుకే ఇళ్లలో పెంచే మందార, గులాబీ, మల్లె, గన్నేరు, తులసి మొక్కలను సేకరించారు.

haritha haram, plants
నర్సరీల ఏర్పాటు, హరితహారం
author img

By

Published : Jun 18, 2021, 12:35 PM IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కోసం పెంచుతున్న నర్సరీలు అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతున్నాయి. జగిత్యాల జిల్లా మెట్​పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 26 వార్డుల కోసం రెండు నర్సరీలను ఏర్పాటు చేశారు. సుమారు రూ.40లక్షలతో 20 రకాల మొక్కలను పెంచేందుకు నిర్మల్, హైదరాబాద్ నుంచి విత్తనాలను తీసుకొచ్చి నాటారు. డిసెంబర్​లో ప్రారంభించిన ఈ నర్సరీల్లో నాటిన విత్తనాలు 35 శాతం మొలకెత్తకపోవడం గమనార్హం.

పర్యవేక్షణ లోపం

మరికొన్ని రోజుల్లో మొక్కలు నాటాల్సి ఉండగా... అధికారుల పర్యవేక్షణలోపం, గుత్తేదారుల నిర్లక్ష్యంతో అవి సరైన సమయానికి చేతికి రాలేదు. కేవలం 65 శాతం మాత్రమే మొలకెత్తడంతో ఇళ్లలో పెంచే మందార, గులాబీ, మల్లె, గన్నేరు, తులసి మొక్కలను సేకరించారు. వాటిని ప్లాస్టిక్ కవర్లలో నాటిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఈదురుగాలులతో వర్షం కురవడంతో నర్సరీల్లోని షెడ్ నెట్లు మొక్కలపై పడ్డాయి. వాటిని ఇంతవరకూ తీయకపోవడం గమనార్హం. మొక్కల చుట్టూ గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగినా పట్టించుకోవడం లేదు. లక్షలు ఖర్చు చేసినా ఫలితం అంతంతమాత్రంగానే ఉంది.

పలు రకాల మొక్కలు

ఖాళీ స్థలాలు, రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రార్థనా మందిరాలు, పార్కులు వంటి ప్రదేశాల్లో వివిధ రకాల మొక్కలు నాటేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇళ్లలో నాటేందుకు పూల మొక్కలు పెంచుతున్నట్లు పురపాలక అధికారులు తెలిపారు. గులాబీ, మల్లె, గన్నేరు, మందారం లాంటి పూల మొక్కలతో పాటు ఉసిరి, మామిడి, జామ, సీతాఫలం, చింత, మునగ మొక్కలను పెంచుతున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 20 రకాల మొక్కలను రెండు నర్సరీల్లో పెంచుతున్నామని వివరించారు. సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి హరితహారానికి సరిపడా మొక్కలు అందించాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి: CJI Justice NV Ramana: శ్రీశైలం సందర్శనలో సీజేఐ జస్టిస్​ ఎన్వీ రమణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.