ETV Bharat / state

KTR Latest News : 'ఎమ్మెల్యేలను కొనడంలో రేవంత్​రెడ్డి సిద్ధహస్తుడు'

KTR fires on Telangana Congress : ఉచిత విద్యుత్‌పై రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలే కాంగ్రెస్‌ విధానమా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఐదు దశాబ్దాల పాటు రైతులను అధోగతి పాలు చేసిన పార్టీ కాంగ్రెస్​ అని ధ్వజమెత్తారు. నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించిన ఆయన.. రేవంత్​రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్‌ పూర్వాశ్రమం అంతా ఆర్ఎస్ఎస్‌దేనని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేలను కొనడంలో రేవంత్ సిద్ధహస్తుడని ఆరోపించారు. ఉచిత విద్యుత్​పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

KTR
KTR
author img

By

Published : Jul 16, 2023, 5:14 PM IST

KTR fires on Revanth Reddy : మంత్రి కేటీఆర్​ ఇవాళ జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఎమ్మెల్సీ ఎల్‌.రమణ తండ్రి సంతాప సభకు హాజరై నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ నివాసంలో సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ కార్యాచరణను కేటీఆర్ వివరించారు. రేపటి నుంచి 10 రోజుల పాటు రైతు వేదికల వద్ద రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశాల్లో మూడు పంటలు కావాలో.. మూడు గంటల కరెంట్‌ కావాలో రైతులు తీర్మానం చేస్తారన్నారు.

ఈ క్రమంలోనే ఉచిత విద్యుత్‌పై రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలే కాంగ్రెస్‌ విధానమా? అని మంత్రి ప్రశ్నించారు. ఐదు దశాబ్దాల పాటు రైతులను అధోగతి పాలు చేసిన పార్టీ కాంగ్రెస్​ అని ధ్వజమెత్తారు. ఉచిత విద్యుత్​పై రేవంత్​ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. కరెంటుపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని.. దీనిపై ప్రజలే తీర్పు ఇస్తారని పేర్కొన్నారు.

KTR fires on Rahul Gandhi : 'కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​గాంధీకి ఎడ్లు తెలవదు, వడ్లు తెలవదు.. రాహుల్​ గాంధీకి క్లబ్బులు, పబ్బులు మాత్రమే తెలుసు' అని కేటీఆర్ విమర్శించారు. రేవంత్​ రెడ్డి ఆర్​ఎస్​ఎస్​ కార్యకర్త అని.. ఆయన ఏనాడైనా మోదీని ప్రశ్నించడం చూశామా అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ హయాంలో రైతులను ఆ పార్టీ రాబందుల్లా పీక్కుతిందని మండిపడ్డారు. తెలంగాణ వ్యవసాయ విధానాన్ని పక్క రాష్ట్రాలు సైతం మెచ్చుకుంటున్నాయని గుర్తు చేశారు.

హిమాన్షు మాట్లాల్లో తప్పులేదు: ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్​పై తీవ్ర విమర్శలు చేశారు. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని.. జగన్ ఆంధ్రకు తీసుకెళ్లారని.. ఇప్పుడున్నది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ కాదు.. చంద్రబాబు కాంగ్రెస్ అని విమర్శించారు. చంద్రబాబు కనుసైగల్లో తెలంగాణ కాంగ్రెస్ నడుస్తోందని ఆరోపించారు. తన కుమారుడు హిమాన్షు వ్యాఖ్యలపై కేటీఆర్​ స్పందిచారు. హిమాన్షు మాట్లాడిన మాటల్లో తప్పులేదని.. ప్రతి పాఠశాలలను కేసీఆర్​ ప్రభుత్వమే బాగు చేస్తుందని అన్నారు.

"రాహుల్‌గాంధీకి ఎడ్లు తెలవదు, వడ్లు తెలవదు. రాహుల్ గాంధీకి క్లబ్బులు, పబ్బులే తెలుసు. రూ.80 వేల కోట్ల కాళేశ్వరంలో రూ.లక్ష కోట్ల స్కామ్ ఎలా సాధ్యం. ఇప్పుడున్నది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ కాదు.. చంద్రబాబు కాంగ్రెస్. రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని జగన్ ఆంధ్రకు తీసుకెళ్లారు. చంద్రబాబు కనుసైగల్లో తెలంగాణ కాంగ్రెస్ ఉంది. రేవంత్‌రెడ్డి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన కార్యకర్త. రేవంత్‌రెడ్డి పూర్వాశ్రమం అంతా ఆర్ఎస్ఎస్‌దే. ఎమ్మెల్యేలను కొనడంలో రేవంత్ సిద్ధహస్తుడు. గాంధీభవన్‌లో ఉన్న గాడ్సే రేవంత్‌రెడ్డి." - కేటీఆర్​, ఐటీ శాఖ మంత్రి

'హిమాన్షు మాటలల్లో తప్పులేదు.. ప్రతి పాఠశాలను కేసీఆర్​ ప్రభుత్వమే బాగు చేసింది'

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.