జగిత్యాల జిల్లా మెట్పల్లి పురపాలక కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న కారణంగా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అధికారులతో పాటు వార్డు కౌన్సిలర్ సభ్యులకు అవగాహన కల్పించారు.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో పాజిటివ్ వస్తున్నందున వారి వివరాలను వైద్య, రెవెన్యూ, పురపాలక, పోలీసు అధికారులకు తెలియజేయాలని వార్డు కౌన్సిలర్లకు ఎమ్మెల్యే సూచించారు. లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ... స్వీయ నిర్బంధంలో ఉంటేనే వైరస్ను తరిమికొట్టగలమని ఎమ్మెల్యే తెలిపారు.
ఇవీ చూడండి: 'కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రాలు నీరుగార్చొద్దు'