ETV Bharat / state

మార్షల్‌ ఆర్ట్స్‌లో అమ్మాయిలు అదుర్స్‌

అమ్మాయిలం కదా... మనకెందుకు అనుకోలేదు వారంతా. నిత్యం చదువులతో కుస్తీపట్టే తాము కరాటేలో రాణిస్తామా అని నిరుత్సాహ పడలేదు. పట్టుదల ఉండాలే గానీ ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థినులు. మార్షల్​ ఆర్ట్స్, కిక్​బాక్సింగ్​లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారు.

మార్షల్‌ ఆర్ట్స్‌లో అమ్మాయిలు అదుర్స్‌
author img

By

Published : Mar 25, 2019, 11:59 AM IST

Updated : Mar 25, 2019, 3:20 PM IST

మార్షల్‌ ఆర్ట్స్‌లో అమ్మాయిలు అదుర్స్‌
జగిత్యాల జిల్లా జయశంకర్​ విశ్వవిద్యాలయం పొలాస వ్యవసాయ కళాశాలలో పీజీ చదువుతున్న విద్యార్థినులు ఓ వైపు చదువులోనూ... మరోవైపు ఆత్మరక్షణకు ఉపయోగపడే కిక్​బాక్సింగ్​, మార్షల్​ ఆర్ట్స్​లోనూ ప్రతిభ కనబరుస్తున్నారు. మొత్తం 40 మంది విద్యార్థులు ఈ కరాటేలో శిక్షణ పొందుతుండగా... జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. ఇందులో ఒక అమ్మాయికి ఏప్రిల్ ​2న టర్కీలో జరిగే పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. గ్రామీణ ప్రాంతం వారైనా.. సత్తా చాటుతున్నారని కళాశాల అసోసియేట్​ డీన్​ సునీతా దేవి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేక సాధన

జగిత్యాలకు చెందిన శిక్షకుడు రామాంజనేయులు విద్యార్థినులకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక సాధన చేయిస్తున్నారు. పొట్టపై రాళ్లను పగలగొట్టడం, బైక్ వెళ్లడం తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. మరిన్ని పతకాలు సాధించేందుకు సాధన చేయిస్తున్నామని శిక్షకుడు రామాంజనేయులు చెబుతున్నారు.

ప్రస్తుతం విద్యార్థినులు పుణెలో జరుగుతున్న పోటీల్లో పాల్గొంటున్నారు. రాబోయే రోజుల్లో దేశానికి పతకాలు అందించేలా కృషి చేస్తామంటున్నారు ఈ కరాటే ఛాంపియన్స్.

ఇదీ చూడండి: నామపత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు

Last Updated : Mar 25, 2019, 3:20 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.