జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు భాజపాలో చేరారు. బండి సంజయ్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రానైట్ నిధులను పేదలకు పంపిణీ చేయకుండా కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. కేసీఆర్, కేటీఆర్ల తీరుపై ఆయన మండిపడ్డారు. గ్రానైట్, కాళేశ్వరం, కరెంట్ కుంభకోణాలు బయట పెట్టి, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించేలా చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఊహల పల్లకీలో... దసరాలోపే మంత్రివర్గ విస్తరణ!