ETV Bharat / state

మిల్లర్లతో కుమ్మక్కై సన్నరకం తీసుకొచ్చారు: జీవన్​రెడ్డి - ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశం

మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కై సన్నరకాల సాగును తీసుకొచ్చారని ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి ఆరోపించారు. ఫలితంగా రైతులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. మక్కలను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.

jeevan reddy press meet for famers in jagtial
మిల్లర్లతో కేసీఆర్ కుమ్మక్కు... రోడ్డున పడిన రైతులు: జీవన్​రెడ్డి
author img

By

Published : Oct 23, 2020, 7:21 PM IST

మిల్లర్లతో సీఎం కేసీఆర్ కుమ్మక్కై సన్నరకాల సాగును తెరపైకి తెచ్చారని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆరోపించారు. ఫలితంగా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు. మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని జగిత్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు.

'ద్వంద్వ విధానం'

రాష్ట్రంలో అంతరపంటగా మొక్కజొన్న సాగు చేశారని... మక్కలను కొనాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌ రాష్ట్రం తీర్మానం చేసిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తీర్మానం చేపట్టకుండా ద్వంద్వ విధానంతో వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు.

'ఇప్పటికైనా మారాలి'

జగిత్యాలలో చేపట్టిన రైతుల ధర్నా చూసైనా సీఎం కేసీఆర్‌ ఆలోచన విధానం మారాలని... మక్కలను కొనుగోలు చేయాలని కోరారు. సన్నధాన్యాన్ని క్వింటాకి రూ.2,500 వెచ్చించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. నాయకులను అరెస్ట్‌ చేసినప్పటికీ... రైతులు స్వచ్ఛందంగా వచ్చి ఆందోళన విజయవంతం చేశారన్నారు.. ఇప్పటికైనా రైతుల డిమాండ్లను సీఎం కేసీఆర్‌ పరిష్కరించాలని జీవన్‌రెడ్డి కోరారు.

ఇదీ చదవండి: నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వండి: ఎంపీ అర్వింద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.