దేశద్రోహిగా కేసు నమోదైన వ్యక్తి ఖాతాలో గూగుల్ పే ద్వారా డబ్బు బదిలీ చేసిన జగిత్యాల జిల్లా కుస్థాపూర్‌కు చెందిన రైతు సరికెల లింగన్నను జమ్ముకశ్మీర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
అసలేం జరిగిందంటే...?
దుబాయిలో పనిచేస్తున్న లింగన్న బావ శ్రీనివాస్ సూచన మేరకు జనవరి 5న 5వేల రూపాయలు, ఆ తర్వాత మరోసారి 4వేల రూపాయలను రాకేశ్ అనే వ్యక్తికి బదిలీ చేశాడు. డబ్బు అందుకున్న రాకేశ్‌కుమార్... అనిత అనే మహిళ వలలో చిక్కుకుని సైన్యానికి సంబంధించిన సమాచారం ఇతరులకు లీక్ చేసినట్లు సమాచారం.
అతనిపై జమ్ముకశ్మీర్‌లోని అర్నియా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్న క్రమంలో కుస్థాపూర్ వాసి డబ్బు బదిలీ చేసినట్లు ఆధారాలు లభించాయి. దీనితో సరికెల లింగన్నకు రాకేశ్‌కు మధ్య ఉన్న సంబంధం ఏమిటనే విషయాన్ని విచారించేందుకు కుస్తాపూర్ జమ్ముకశ్మీర్ పోలీసులు చేరుకున్నారు. లింగన్నను అదుపులోకి తీసుకున్నట్లు మల్లాపూర్ ఎస్సై రవీందర్ తెలిపారు. ప్రస్తుతం అర్నియా పోలీసులు లింగయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
సంబంధిత కథనం: జమ్ముకశ్మీర్ పోలీసులు లింగన్నను ఎందుకు అదుపులోకి తీసున్నారు?