జగిత్యాల జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత బయటకు వచ్చిన వాహనదారులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ-పాస్ లేకుండా అనవసరంగా రోడ్డుపైకి వచ్చిన వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు.
కొత్త బస్టాండ్ సర్కిల్‌లో ఎడమ వైపు పోలీసులు వాహనాలు ఆపుతుంటే ఓ యువకుడు.. వారి కళ్లుగప్పి కుడివైపు రహదారి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన పోలీసులు అతణ్ని పిలిచి.. బైక్ తాళాలు తీసుకున్నారు. లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినందుకు వాహనాన్ని తోసుకుంటూ వెళ్లి యూటర్న్ తీసుకుని తమ వద్దకు రావాలని ఆదేశించారు. అలా ఆ యువకుడు దాదాపు 400 మీటర్లు బైక్ను తోస్తూ పోలీసుల వద్దకు చేరి క్షమాపణ చెప్పాడు.