అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా.. కొందరు అక్రమార్కులు వారి కళ్లుగప్పి నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్లో ముందస్తు సమాచారంతో పోలీసులు గుట్కా నిల్వల స్థావరంపై దాడి చేశారు.
ఈ దాడిలో మూడు లక్షల 10 వేల రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కాను స్వాధీనం చేసుకున్నట్లు జగిత్యాల గ్రామీణ సీఐ రాజేశ్ తెలిపారు. ఈ కేసులో సత్యనారాయణ అనే వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.