జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌లో రైతు వేదిక నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. 22 లక్షలతో నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. రైతు వేదికల ద్వారా అన్నదాతల సమస్యలను పరిష్కరించే వీలుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. రైతు ప్రభుత్వమని.. వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.
ఇవీచూడండి: ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా భయం.. జంకుతున్న అధికారులు