జగిత్యాల జిల్లాలోని ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరవాలని డిమాండ్ చేస్తూ చెరుకు రైతులు ఛలో కలెక్టరేట్‌కు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు ధర్నాను భగ్నం చేసేందుకు ఉపక్రమించారు. జిల్లా వ్యాప్తంగా 150 మంది రైతు నాయకులను రాత్రికి రాత్రే అరెస్టు చేశారు.
తమ నాయకుల్ని అరెస్టు చేసినా.. తామే ముందుడి ఈ ధర్నా కొనసాగిస్తామని రైతులు స్పష్టం చేశారు. ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీ తెరిచే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
- ఇదీ చదవండి : చారిత్రక 'దండి' సత్యాగ్రహానికి రేపటితో 91 ఏళ్లు