ETV Bharat / state

నేరాల కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం: సింధూశర్మ

నేరాల కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ చెప్పారు. 2020 సంవత్సరానికి గాను నేరాల తీరును వివరించారు.

jagityala district sp sindhusharma press meet
నేరాల కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం: సింధూశర్మ
author img

By

Published : Dec 30, 2020, 4:14 PM IST

జగిత్యాల జిల్లాలో నేరాల అదుపునకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ సింధూశర్మ తెలిపారు. 2020 సంవత్సరానికి గాను నేరాల తీరును ఆమె వివరించారు. జిల్లాలో 23 హత్యలు జరిగాయని.. గతేడాది కంటే అదనంగా 9 ఎక్కువగా ఉన్నాయన్నారు. పగటి చోరీలు 13 ఉండగా.. రాత్రి చోరీలు 42 ఉన్నాయన్నారు. ఇది గతేడాది కంటే తగ్గాయన్నారు. దోపిడీ కేసులు 13 ఉన్నాయని, అపహరణ కేసులు 22 ఉన్నాయని తెలిపారు.

హత్యాచారాలు 35 వరకు జరిగాయన్నారు. చోరీ కేసుల్లో 45 తులాల బంగారాన్ని రికవరీ చేశామన్నారు. జిల్లాలో 363 రోడ్డు ప్రమాదాలు జరిగితే.. 140 మంది మృతి చెందారని చెప్పారు. బియ్యం అక్రమ రవాణాలో 114 కేసులు నమోదు చేసి 181 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. పేకాట శిబిరాలపై దాడి చేసి 234 కేసులు నమోదు చేసి రూ. 30 లక్షల 41 వేల 156 స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 11 మందిపై గల్ఫ్​ చీటింగ్‌ కేసులు నమోదు చేశామని.. స్మైల్‌ ఆపరేషన్‌లో 58 మంది పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు.

ఇదీ చదవండి: ఈ ఏడాదిలో నేరాలు తగ్గాయ్.. మరింత మెరుగుపడ్డాం: డీజీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.