జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని ఓ గ్రామంలో 65 ఏళ్ల వృద్దుడికి కరోనా పాజిటివ్ కేసు నమోదయింది. ప్రస్తుతం అతను గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆ గ్రామంలో జిల్లా అధికార బృందం పర్యటించింది. ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవి, జిల్లా ఎస్పీ సింధుశర్మ, అదనపు కలెక్టర్ రాజేశం, జిల్లా వైద్యాధికారి పుప్పాల శ్రీధర్లు ఉన్నారు.
3 కిలోమీటర్ల పరిధిలోని సమీప అయిదు గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినట్లు కలెక్టర్ గుగులోతు రవి తెలిపారు. ఈ 5 గ్రామాల్లోకి ఎవరూ రాకుడదని.. గ్రామాల నుంచి ఎవరూ బయటకు వెళ్లరాదని ప్రజలకు సూచించారు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వెంటనే అధికారులకు తెలపాలని చెప్పారు. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ గ్రామస్థులకు హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: ఆ జిల్లాల్లో సడలింపులు ఇవ్వొద్దు: వైద్యఆరోగ్య శాఖ