జగిత్యాల జిల్లా సారంగపూర్ మండలం రేచపల్లి గ్రామస్థులు ఆందోళనకు దిగారు. అసలే కూలీ చేసుకునే వారికి నెలకు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు విద్యుత్ బిల్లులు రావటంతో నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ వద్దకు చేరుకున్న గ్రామస్థులు అధిక విద్యుత్తు బిల్లులను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు.
ఇంత మొత్తంలో ఎలా వేస్తారు...
కూలీ చేసుకుని జీవించే తాము రెండు బల్బులు, ఫ్యాను వాడినందుకునే ఇంత మొత్తంలో బిల్లులు ఎలా వేస్తారని విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నించారు. గతంలో బిల్లు రూ.300 వరకు మాత్రమే వచ్చేదని.. ఇప్పుడు అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అధిక బిల్లులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చూడండి : ఉప్పొంగుతున్న గోదావరి... 60 అడుగులకు చేరిన నీటిమట్టం