వరుణుడి జాడ కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. ఈ సీజన్లో ఇదే తొలి భారీ వర్షం కావటంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అరగంటకు పైగా కురిసిన వర్షానికి జగిత్యాల పట్టణంలో రోడ్లలన్నీ జలమయమయ్యాయి. భారీ వర్షం కురవటం వల్ల కర్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు వర్షాల్లేక అల్లాడుతున్న జగిత్యాల పట్టణ ప్రజలు ఈ వర్షంతో ఉపశమనం పొందుతున్నారు. ధర్మపురి వద్ద గోదావరి నిండ కుండలా ప్రవహిస్తోంది.
జగిత్యాలలో భారీ వర్షం... రైతుల్లో ఆనందం - తొలకరి వానతో రైతుల్లో ఆనందం
ఎండల తాకిడికి అల్లాడిపోయిన రాష్ట్ర వాసులకు తొలకరి ప్రవేశంతో ఉపశమనం పొందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో వర్షాలు లేక అల్లాడిపోయిన అన్నదాతలు ఇవాళ భారీ వర్షం కురవటం వల్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.