జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కార్తిక శనివారం సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా... స్వామివారి నామస్మరణతో మారుమోగింది.
ఇదీ చూడండి: 'రైల్వేను ప్రైవేటీకరించం.. కార్పొరేటీకరిస్తాం అంతే!'