జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయంలో హనుమాన్ జయంతిని నిరాడంబరంగా నిర్వహించారు. ఏటా లక్షలాది మంది భక్తుల నడుమ జరిగే ఈ వేడుకలు... కరోనా కారణంగా ఆలయంలో సాదాసీదాగా జరిగాయి. మూలవిరాట్‌కు పట్టు వస్త్రాలు సమర్పించి... ప్రత్యేకంగా అలంకరించారు. అభిషేకాలు, పూజలు నిర్వహించారు.
ఆలయంలోకి అనుమతి లేకపోవడం వల్ల భక్తులు, హనుమాన్ దీక్షాస్వాములు దేవస్థానం పరిసరాల్లో మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తులు ఆలయంలోకి రాకుండా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 30 వరకు ఆలయం మూసి ఉంటుందని ఈవో చంద్రశేఖర్ తెలిపారు.
ఇదీ చదవండి: మెట్పల్లి ఆలయాల్లో హనుమాన్ జయంతి వేడుకలు