సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురిలో కార్తిక మాస ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. యమద్వితీయ సందర్భంగా ఆలయంలో యమధర్మరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకం చేశారు. కార్తిక మాసంతో జగిత్యాల జిల్లాలోని ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిక్షేత్రంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ పండితులు, స్థానికులు మేళతాళాలు, మంగళహారతులతో గోదావరికి తరలి వెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం హారతి ఇచ్చారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మహిళలు గోదావరి నదిలో కార్తిక దీపాలను వదిలారు. కార్తిక మాసాంతం గోదావరి హారతి కార్యక్రమం జరగనుంది.
ఇదీ చదవండి: భక్తి పారవశ్యం.. భద్రాద్రిలో జన సందోహంగా గోదారి తీరం