ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2.50 లక్షల హెక్టార్ల అటవీభూమి ఉండగా... 33వేలు హెక్టార్ల వరకు భూమిలోని చెట్లు నరికివేతకు గురయ్యాయి. జిల్లాలో 34 లక్షల వరకు జనాభా ఉండగా ప్రస్తుతం ఉన్న చెట్లు ఆక్సీజన్ వరకు సరిపోతున్నా వాతావరణాన్ని చల్లబరచటం, వర్షాలను కురిపించేలా చేయలేకపోతున్నాయి. ఒక ఎకరం విస్తీర్ణంలో పెరిగిన చెట్లు సంవత్సరం పాటు 18 మందికి ఆక్సీజన్‌ను అందించగలుగుతాయి.
ప్రయోజనాలు ఇలా...
* ఒక తుమ్మచెట్టు సాలీనా 330 పౌండ్ల కార్బన్‌డైఆక్సైడ్‌ను, చింత, వేపచెట్లు 59 పౌండ్ల కార్బన్‌డైఆక్సైడ్‌ను గ్రహించి మనకు ఆక్సిజన్‌ను అందిస్తాయి. ఒక ఎకరం విస్తీర్ణంలో పెరిగిన చెట్లు సంవత్సరం పాటు 18 మందికి ఆక్సిజన్‌ను అందించగలుగుతాయి. ఒక కారు 26 వేల మైళ్లు తిరిగితే వెలువడే కార్బన్‌డైఆక్సైడ్‌ను ఎకరంలోని చెట్లు పీల్చుకుని మంచిగాలిని విడుదల చేస్తాయి.
* కార్బన్‌డైఆక్సైడ్, అమోనియా, సల్ఫర్ ఆక్సైడ్, ఓజోన్3 తదితర హానికర వాయువులు గ్రీన్‌హౌజ్‌లో కలవకుండా చెట్లు వీటిని అడ్డుకుంటాయి. సూర్యుడి నుంచి వెలువడే కిరణాలు రహదారులు, నేల, భవనాలపై పడకుండా అడ్డుకుని భూమి వేడెక్కడాన్ని తగ్గిస్తాయి. ఒక చెట్టు వానానికి 15 గ్యాలన్ల నీటిని తీసుకుని పరిసరాల్లోని గాలిలోకి తగినంత తేమను విడుదల చేస్తుంది.
* పైర్లపై ఆశించే చీడపీడల్లో 200 వైరస్, బ్యాక్టీరియా కారకాలను ఒక్క వేపచెట్టు నాశనంచేస్తుంది. సబ్బులు, ఔషధాలు, మందులు, అలంకార తయారీల్లో చెట్లనుంచి వెలువడిన ఉత్పత్తులే ఆధారం. చెట్ల పచ్చదనం కంటిచూపును మెరుగుపరుస్తుంది, మనిషిలోని నేరపూరిత స్వభావాన్ని తగ్గిస్తుంది.
నాటిన మొక్కలన్నీ చెట్లుగా పెరిగేలా చర్యలు తీసుకోవాలి. చెట్ల ఆకుల్లోని పచ్చదనం వేడిగాలులను, హానికర వాయువులను పీల్చుకుని ఆక్సీజన్‌ను విడుదల చేస్తాయి. ఇళ్లవద్ద మరుగుజ్జు వృక్షాలైన చింత, మర్రి, వేప, నిమ్మ, బత్తాయి తదితరాలను కూడా సేకరించి పెంచుకోవచ్చు.
- ఎన్.నవత, వాతావరణ శాస్త్రవేత్తచెట్లున్న ప్రాంతాల్లో తేమ పరిరక్షింపబడి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు చెట్లు ఎంతగానో దోహదంచేస్తాయి. ఇళ్లలోనూ, వసారాల్లోనూ మనగలిగే మొక్కలను పెంచటంవల్ల మన ఆరోగ్యాలు బాగుంటాయి. కుండీల్లో పెరిగిన మొక్కలను జాగ్రత్తగా మరో పెద్దకుండీలో నాటవచ్చు, బాగా పెరిగితే నేలపై నాటవచ్చు.
- పి.సాద్విరెడ్డి, శాస్త్రవేత్త
చెట్లతోనే మనుగడ
ఉమ్మడి జిల్లాలో 6.10 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగాఉంది. ప్రైవేటు నర్సరీలనుంచి మొక్కలను కొనుగోలు చేయడంతో పాటుగా ప్రభుత్వ హరితహారం కార్యక్రమం ద్వారా పండ్లు, పూలు, ఔషధమొక్కలను సరఫరా చేస్తున్నందున ప్రజలు వీటిని కూడా తీసుకోవచ్చు. ఇళ్లవద్ద ఖాళీస్థలాలతో పాటుగా ఇండోర్‌ప్లాంట్లను ఇళ్లలోని గదుల్లోనూ పెంచవచ్చు. ఇళ్లు, పంటపొలాలు, ఇతరత్రా స్థలం ఎక్కువున్నవారు మామిడి, సీతాఫలం, జామ, ఉసిరి, వాటర్‌ఆపిల్, తెలంగాణ ఆపిల్, బత్తాయి, దానిమ్మ తదితర పండ్లమొక్కలను, వేప, అలక్టోనియా, కదంబ, కానుగ తదితర నీడనిచ్చే మొక్కలను కూడా నాటుకోవచ్చు. ఇళ్ల స్థలాలను బట్టి దాదాపుగా 120 రకాల వరకు మొక్కలను, చెట్లను పెంచుకునే అవకాశముండగా వీటిల్లో 44 రకాలు హరితహారం నర్సరీల్లో లభిస్తున్నాయి.
ఇవీ చూడండి: రెండు రాష్ట్రాలు రెండేసి టీఎంసీల ప్రతిపాదన