జగిత్యాల జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికుల తాకిడి పెరిగింది. వారు నేరుగా ఇళ్లకు వెళ్లకుండా అధికారులు జాగ్రత పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 5 వేల మంది జిల్లాకు చేరుకున్నారు. జగిత్యాలకు వచ్చే వారి వివరాలు సేకరించి.. ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు 12మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారులు తేల్చి చికిత్స నిమిత్తం హైద్రాబాద్ కు తరలించారు. ఈ జిల్లా నుంచి అధిక శాతం ఉపాధి కోసం ముంబయి, పుణె తదితర ప్రాంతాలకు వలస వెళ్లారు. నగర శివారులోనే వైద్య పరీక్షలు నిర్వహించి ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వలస కార్మికులు.. విధిగా 28రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: లాక్డౌన్ మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం