Jagityala Municipality Master Plan Updates Today: జగిత్యాల మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్‌కు వ్యతిరేకంగా రెండో రోజు రైతులు ఆందోళన నిర్వహించారు. సమీపంలోని నర్సింగాపూర్, తిమ్మాపూర్, మోతె, తిప్పన్నపేట గ్రామాలకు చెందిన రైతులు జగిత్యాల మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. దాదాపు రెండు గంటలపాటు ఆందోళన నిర్వహించి, కార్యాలయంలోకి వెళ్లేందుకు యత్నించగా పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆగ్రహించిన వారు మాస్టర్ ప్లాన్ ప్లెక్సీని చింపి దహనంచేశారు. రీ క్రియేషన్ జోన్ నుంచి తమ గ్రామాలను తొలగించాలని డిమాండ్ చేశారు. తమకు తెలియకుండానే మాస్టర్ ప్లాన్ అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోవటం సరికాదని, తమ గ్రామాల పేర్లను జాబితా నుంచి తొలగించాలన్నారు. లేదంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
నర్సింగాపూర్, తిప్పన్నపేట, మోతె, తిమ్మాపూర్ పలు గ్రామాలకు చెందిన మేమంతా రైతులం. రీ క్రియేషన్ జోన్ ఇండస్ట్రీ జోన్ అని మున్సిపాలిటీ అధికారులు కేటయించడం జరిగింది. టౌన్ ప్లానింగ్‌లో 2041లో జోన్ వైజ్‌గా డిక్లెర్ చేయడం జరిగింది. దాని వల్ల మేము రోడ్డు ఎక్కడం జరిగింది. దీనికి రైతులము అందరం ఆందోళన చేయడం జరుగుతుంది. జోన్ వైజ్‌గా తొలగించాలి, మాకు యధావిధిగా ల్యాండ్స్ ఉండాలి. ఎలాంటి నిబంధనలు పెట్టకూడదు. -రైతులు
ఇవీ చదవండి: