ETV Bharat / state

పండుగ తర్వాత పోరాట కార్యాచరణ.. జగిత్యాల రైతుల అల్టిమేటం..! - జగిత్యాల జిల్లా వార్తలు

Jagtial Master Paln Issue : జగిత్యాల మాస్టర్‌ప్లాన్‌ ముసాయిదాకు వ్యతిరేకంగా రోజురోజుకూ నిరసనలు మరింత ఉద్ధృతమవుతున్నాయి. సంక్రాంతి ముగ్గులు వేసి, భోగి మంటల్లో ఫ్లెక్సీలను వేసి.. బృహత్‌ ప్రణాళికను వెనక్కి తీసుకోవాలని ప్రభావిత గ్రామాల రైతులు నినదించారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పండుగ తర్వాత పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఏ ఒక్క రైతు అభిష్టానికి వ్యతిరేకంగా భూమిని మాస్టర్‌ప్లాన్‌లో చేర్చబోమని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ హామీ ఇచ్చారు.

రైతుల నిరసన
రైతుల నిరసన
author img

By

Published : Jan 15, 2023, 7:16 PM IST

Jagtial Master Paln Issue : జగిత్యాల మాస్టర్‌ప్లాన్‌కు వ్యతిరేకంగా నిరసనల మంటలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే వివిధ రూపాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న ప్రభావిత గ్రామాల రైతులు సంక్రాంతి పండుగను నిరసనకు అస్త్రంగా మార్చుకున్నారు. జగిత్యాల గ్రామీణ మండలం తిమ్మాపూర్‌ కర్షకులు మాస్టర్‌ ప్లాన్‌ ఫ్లెక్సీని బోగీ మంటల్లో దహనం చేశారు. నర్సింగాపూర్‌, మోతెలో బృహత్‌ ప్రణాళిక మాకు వద్దంటూ ముగ్గులు వేశారు. మోతెలో పండుగ రోజు రైతుల ఆందోళన కొనసాగించారు. ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలంటూ జగిత్యాల గ్రామీణ మండలం నర్సింగాపూర్‌కు చెందిన ఆరో వార్డు సభ్యురాలు ఆరె శ్రీలత రాజీనామపత్రాన్ని పంచాయతీ కార్యదర్శికి అందించారు.

తాతల కాలం నుంచి సాగుచేసుకుంటున్న భూములను ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌లో చేర్చడం సరికాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బృహత్‌ ప్రణాళికను ఉప సంహరించుకుంటున్నట్లు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. సర్కారు దిగిరాకపోతే సంక్రాంతి తర్వాత ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

"ప్రభుత్వం మాస్టర్​ప్లాన్​ను తక్షణం రద్దు చేయాలి. మా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూములను మాస్టర్​ప్లాన్​లో చేర్చటం సరికాదు. పోనుపోను ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తాం. జగిత్యాల మాస్టర్​ ప్లాన్​ను రద్దు చేస్తున్నట్లు మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తాం". - రైతులు

రైతుల ఆందోళననలు ఉద్ధృతం కావడంతో కర్షకుల అభిష్టానికి వ్యతిరేకంగా వారికి చెందిన భూమిని మాస్టర్‌ప్లాన్‌లో చేర్చబోమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. విపక్షాలు రాద్దాంతం చేసి రైతులను రెచ్చగొట్టడం సరికాదని మండిపడ్డారు.

"రైతుల అభిష్టానికి వ్యతిరేకంగా మాస్టర్​ప్లాన్​లో ఎకరం భూమిని కూడా చేర్చబోం. వారికి ఎటువంటి అభ్యంతరాలున్నా స్వీకరించడానికి ప్రభుత్వం నోటిఫికేషన్​ జారీ చేసింది. దానికి ఇంకా గడువు ఉంది. విపక్షాలు రైతులను రెచ్చగొట్టడం సరికాదు. రైతుల భూములను బలవంతంగా ప్రభుత్వం తీసుకోదు". - ఎమ్మెల్యే సంజయ్​కుమార్

జగిత్యాల మాస్టర్​ప్లాన్​కు వ్యతిరేకంగా రైతుల నిరసన

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.