ETV Bharat / state

Paddy procurement problems in telangana: 'వర్షం ఆగదు.. అధికారులు కాంటా వేయరు..!'

(delay in paddy procurement) ధాన్యం కొనుగోళ్లలో అలసత్వంపైఅన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. (farmers dharna)ప్రభుత్వాలు, అధికారుల తీరును నిరసిస్తూ అన్నదాతలు రహదారులపై ధర్నాకి దిగారు. సోమవారం నాడు మెదక్ జిల్లా చిట్కుల్ రైతులు, జగిత్యాల జిల్లా తాటిపల్లి రైతులు, మాచారెడ్డి మండలానికి చెందిన అన్నదాతలు ఆందోళన చేపట్టారు.

paddy procurement problems in telangana, farmers problems in telangana
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై అన్నదాతల ఆందోళన
author img

By

Published : Nov 22, 2021, 5:35 PM IST

ధాన్యం కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతల ఆందోళనలు(farmers dharna) కొనసాగుతున్నాయి. రోజుల కొద్దీ ధాన్యం కుప్పల దగ్గర పడికాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. (delay in paddy procurement) అధికారుల అలసత్వం తమ పాలిట శాపంగా మారిందంటూ రోడ్లపై ధర్నాలకు దిగారు.

paddy procurement problems in telangana, farmers problems in telangana
ధాన్యం కొనుగోళ్లలో జాప్యంపై అన్నదాతల ఆందోళన

చిట్కుల్ రైతుల ఆందోళన

ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్​తో మెదక్ జిల్లా చిట్కుల్​ అన్నదాతలు మెదక్ - జోగిపేట ప్రధాన రహదారిపై ధర్నా(Farmers protest 2021) చేపట్టారు. రైతుల ఆందోళనతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నా... కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం సంచులను రోడ్డుపై వేసి తగలబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలికి వచ్చి అన్నదాతలకు నచ్చజెప్పారు.

జగిత్యాలలో ధర్నా

జగిత్యాల జిల్లాలో అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ... తాటిపల్లి జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఓ వైపు అకాల వర్షాలు ఇబ్బంది పెడుతుంటే...ధాన్యం కొనుగోలు చేయకపోవటంతో తీవ్రంగా నష్టపోతున్నామని(farmers problems in telangana) ఆవేదన వ్యక్తం చేశారు. మిల్లర్లు తేమ, నూక పేరుతో లారీలను దించుకోవటం లేదన్నారు. గంటపాటు రాస్తారోకో చేయటంతో కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. అధికారులు ధాన్యం కొంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు.

రోడ్డెక్కిన అన్నదాతలు

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలో రైతులు ధర్నాకి దిగారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం దేవునిపల్లి, మంథని గ్రామ రైతులు కామారెడ్డి-కరీంనగర్ రహదారి పై బైఠాయించారు. నాలుగైదు రోజుల క్రితం కురిసిన వర్షాలకు వరి కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయిందని... మొలకలు వస్తున్నాయని వాపోయారు. కొనుగోలు కేంద్రంలోని అధికారులేమో.. మ్యాచర్ వస్తేనే కొంటామని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగైదు రోజులుగా వర్షమే కురుస్తుంటే... మ్యాచర్ ఎలా వస్తుందని అడిగితే.... తమకు సంబంధం లేదని అంటున్నారని... ఇక ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ ధర్నాతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని రైతులకు నచ్చజెప్పారు. కొనుగోలు కేంద్రాల అధికారులతో మాట్లాడి... ధాన్యం కొనుగోలు త్వరితగతిన పూర్తి చేసేలా చూస్తామని మాచారెడ్డి ఎస్సై శ్రీనివాస్ రెడ్డి హామీ ఇవ్వడంతో ధర్నా విరమింపజేశారు.

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు దాటింది. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.. వరుణుడు కరుణిస్తలేడు. కాంటాలు వేసినా.. వీటిని మిల్లులకు తరలించేందుకు ఒక్క లారీ కూడా రావడం లేదు. లారీల కొరత, గన్నీ బ్యాగులు లేక అవస్థలు ఎదుర్కొంటున్నాము. ఓ వైపు మబ్బు పట్టడంతో ఆరబోసిన ధాన్యం పచ్చిగా అయిపోతుంది. వర్షానికి ధాన్యం తడిసి ముద్దయిపోతోంది. హమాలీల ఖర్చు, కిరాయిలు భరించలేకపోతున్నాం. ఆరుగాలం శ్రమించిన పంట నీటి పాలయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకుని త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలి.

-రైతుల గోడు

జగిత్యాలలో అన్నదాతల ఆందోళన

ఇదీ చదవండి: rice exports telangana 2021 : పుష్కలంగా పండుతున్నా.. ధాన్యం ఎగుమతులు అంతంతమాత్రమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.