పసుపు ధర రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం నాడు క్వింటా ధర రూ. 10,220 పలికింది. మంగళవారంతో పోలిస్తే ఒక్కరోజులోనే రూ. 1,311 అధికంగా ధర పలకడంతో రైతులు ఆనందంతో ఉన్నారు.
మెట్పల్లి మార్కెట్ యార్డులో ఈనామ్ ద్వారా జరుగుతున్న పసుపు కొనుగోళ్లను వ్యాపారులు వారికి నచ్చిన ధరకు సొంతం చేసుకుంటున్నారు. రంజిత్ అనే రైతు వద్ద నుంచి శ్రీనివాస్ రెడ్డి అనే వ్యాపారి క్వింటాలుకు రూ. 10,200 వెచ్చించి కొనుగోలు చేశారు. కాడిరకం రూ. 10200, గోలరకం రూ. 7,777, చూరరకం రూ 6, 416 ధర పలుకుతోంది.
మార్కెట్లో పసుపు కొనుగోళ్లు జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు 15,939 క్వింటాళ్ల పసుపును కొనుగోలు జరిగినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు. దళారులను నమ్మి మోసపోకుండా రైతులు మంచి పసుపును తీసుకొస్తే వ్యవసాయ మార్కెట్లో అనుకున్న ధర వస్తుందని రైతులకు సూచించారు. రోజురోజుకు పసుపు ధరలు పెరుగుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: బీమా క్లెయిమ్ కేసులో తవ్వే కొద్దీ నిజాలు