ETV Bharat / state

Attack on Minister KTR: మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌పై చెప్పు దాడి! - కేటీఆర్​పై చెప్పు దాడి

Attack on Minister KTR: మంత్రి మల్లారెడ్డిపై ఆగ్రహించిన రెడ్లు.. చెప్పులు, రాళ్లతో చేసిన దాడి మరవక ముందే.. అలాంటి ఘటనే మరొకటి జరిగింది. అది కూడా మంత్రి కేటీఆర్​ మీద..! అవునా..? ఎక్కడ జరిగింది..? దాడి ఎవరు చేశారు..? కేటీఆర్​పై అంత కోపం ఎవరికుంది..? మొత్తానికి అసలేం జరిగింది.

farmer slipper attack on minister ktr convoy at metpally

author img

By

Published : Jun 10, 2022, 9:56 PM IST

Updated : Jun 10, 2022, 10:44 PM IST

మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌పై చెప్పు దాడి

Attack on Minister KTR: మొన్నీమధ్యే.. మంత్రి మల్లారెడ్డిపై రెడ్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా.. చెప్పులు, రాళ్లు, బాటిళ్లు, చైర్లు.. ఇలా ఏది పడితే అది విసురుతూ.. తమ కోపాన్ని ప్రదర్శించారు. ఈ దాడి ఇప్పుడిప్పుడే మరుగున పడుతున్న వేళ.. అలాంటి ఘటనే మరొకటి చోటుచేసుకుంది. అది కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్​పైన! నిజంగానే జరిగిందా..? అలా ఎందుకు జరిగింది...? అసలు కేటీఆర్​పై అంత కోపం ఎవరికుంది..? అనే ప్రశ్నలు తెలుసుకోవాలంటే.. జగిత్యాల జిల్లా మెట్​పల్లికి వెళ్లాల్సిందే.

రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ఈరోజు జగిత్యాల జిల్లాలో పర్యటించారు. కాగా.. ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరవాలంటూ చెరకు రైతులు ఈ మధ్య కాలంలో ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఏడేళ్లయినా.. ఇప్పటికీ ఫ్యాక్టరీ తెరవకపోవటం వల్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో మంత్రి కేటీఆర్​.. జగిత్యాలలో పర్యటిస్తుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మంత్రి మల్లారెడ్డిపై జరిగిన ఘటనను దృష్టిలో ఉంచుకోవటంతో పాటు.. రైతులు చేస్తున్న ఆందోళనల ప్రభావం పర్యటనపై పడకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. జిల్లావ్యాప్తంగా రైతుసంఘాల నాయకులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులను పోలీసులు ముందస్తు అరెస్ట్​లు కూడా చేశారు. అదే క్రమంలో.. చెరకు రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణ రెడ్డితో పాటు పలువురు రైతులను కూడా అదుపులోకి తీసుకుని మెట్​పల్లి పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఏ తప్పు చేయకున్నా ఇలా అకారణంగా అరెస్ట్​లు చేయడం అన్యాయమని ఠాణా ప్రాంగణంలో నిలబడి పోలీసులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అదే సమయంలో మెట్​పల్లిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి కేటీఆర్​ అటుగా వెళ్తున్నారు. స్టేషన్ ముందు నుంచి కేటీఆర్ వెళ్తుండటం గమనించిన నారాయణరెడ్డి.. పరిగెత్తుకుంటూ వెళ్లి మంత్రి కాన్వాయ్​పై చెప్పు విసిరారు. అప్పటివరకు కాన్వాయ్​పై దృష్టి పెట్టిన పోలీసులు.. వెనక నుంచి నారాయణరెడ్డి పరుగెత్తుకుంటూ రావటాన్ని గమనించలేకపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. అతడ్ని అడ్డుకుని స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు.

ఇవీ చూడండి:

Last Updated : Jun 10, 2022, 10:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.