ETV Bharat / state

పంట రుణమాఫీకి సర్వం సన్నద్ధం

రైతుల పంట రుణ మాఫీకి ఈ నెల 6వ తేదీ నుంచే నిధులు విడుదల, అర్హుల గుర్తింపు, చెక్కుల పంపిణీ తదితర ప్రక్రియలను చేపడతామని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో రూ.25 వేలకన్నా తక్కువగా పంటరుణం కలిగిన రైతులకు మొదటి విడతలో నిధులందే అవకాశముంది...

every thing is ready for  Loan waiver in jagityal
పంట రుణమాఫీకి సర్వం సన్నద్ధం
author img

By

Published : May 7, 2020, 12:39 PM IST

శాసనసభ ఎన్నికల హామీమేరకు రూ. లక్షవరకు పంటరుణాన్ని మాఫీ చేయనున్నారు. ఈ క్రమంలో తొలివిడతగా రూ. 25 వేలకన్నా తక్కువ రుణమున్నవారికి పూర్తిగా నిధులను విడుదల చేయనున్నారు. వీరు జిల్లాలో 16,100 వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో బ్యాంకుల్లోని రైతుల పంటరుణ ఖాతాలకు, పొదుపు ఖాతాలకు నిధులను విడుదల చేయగా బ్యాంకర్లు వడ్డీకి, ఇతరత్రా మినహాయించుకున్నారని రైతులు ఆరోపించడంతో ప్రస్తుతం రైతులకు నేరుగా చెక్కులను పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ చెక్కులను వారి ఖాతాలున్న ఏ బ్యాంకులోనయినా విడిపించుకోవచ్చు.

* జిల్లాలో వానాకాలం, యాసంగి పంటకాలాల్లో 1.75 లక్షల మంది రైతులు రూ.1,390 కోట్లవరకు పంటరుణాలను తీసుకుని ఉన్నారు. 2018 డిసెంబరు 11వ తేదీ వరకు పంటరుణం తీసుకుని ఉన్న రైతులకు మాఫీ వర్తిస్తుందని పేర్కొనగా జిల్లాలో 1.48 లక్షల మంది రైతులు ఈ తేదీలోపు రూ.711 కోట్లు పంటరుణం తీసుకుని ఉన్నట్లు బ్యాంకర్లు ప్రభుత్వానికి నివేదించారు. తదుపరి వీరిలో అర్హులను తేల్చి సర్కారు సాయాన్ని అందించనున్నారు.

* మాఫీ నిబంధనల ప్రకారం ఒక రైతు, అతని భార్య, ఆధారపడిన మైనర్‌ పిల్లలను కుటుంబంగా తీసుకుని ఒక యూనిట్‌గా పరిగణించి రూ.లక్షను మాఫీ చేస్తారు. వీరిపేర్లపై ఎన్ని బ్యాంకుల్లో రుణమున్నా రూ.లక్ష గరిష్ఠంగా మాఫీ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని వారు బంగారంపై తీసుకున్న పంటరుణాలకు కూడా మాఫీని వర్తింపచేస్తారు. ఈ క్రమంలో అన్నిరకాల రుణాలను కలుపుకుని రూ.లక్ష వరకు మాఫీ చేసేందుకు అర్హులను గుర్తిస్తారు. తొలుత ఆధార్‌ అనుసంధానంతో బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను విశ్లేషించి అర్హులు, తొలగింపు జాబితాలను సిద్ధం చేస్తారు. తదుపరి గ్రామ సభలు, మండల సభలు, అధికారుల కమిటీ పునఃపరిశీలన అనంతరం అర్హులకు నిధులను అందిస్తారు.

* 2014 ఎన్నికల హామీ మేరకు రూ.లక్ష పంటరుణాన్ని మాఫీ చేయగా ఉమ్మడి జిల్లా రైతులకు రూ.1,609 కోట్లవరకు మాఫీ ప్రయోజనం దక్కింది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లా రైతులకు రూ.405 కోట్లవరకు రాగా ఈ మొత్తాన్ని నాలుగు విడతలుగా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేశారు. తొలివిడతలో వడ్డీని తీసుకోగా తదుపరి వెనక్కివ్వకపోగా ప్రస్తుత ఈ విధానానికి బదులుగా చెక్కుల జారీని ఎన్నుకున్నారు. గతంలో ఎంత రుణం ఉన్నా నాలుగు భాగాలుగాచేసి మాఫీ చేశారు. కానీ ప్రస్తుతం రూ. 25 వేల వరకు రుణమున్న చిన్న రైతులకు ఒకేసారి మాఫీ మొత్తాన్ని ఇవ్వనున్నారు. తదుపరి మిగిలినవారికి విడతల్లో మాఫీమొత్తాన్ని చెల్లించనుండటంతో రైతుల్లో అర్హుల జాబితాపై ఆసక్తి నెలకొంది. జాబితాల వడబోత అనంతరం జిల్లాలో రూ. 510 కోట్లవరకు రైతులకు పంటరుణాలు మాఫీ అయ్యే అవకాశముండగా త్వరలోనే అందరికీ చెల్లింపులు ప్రారంభించాలని అన్నదాతలు అభిలషిస్తున్నారు.

ప్రభుత్వానికి వివరాల సమర్పణ

జిల్లాలోని అన్ని బ్యాంకుల్లోనూ 2018 డిసెంబరు 11కన్నా ముందుగా తీసుకుని ఉన్న పంటరుణ ఖాతాల వివరాలను ప్రభుత్వానికి సమర్పించామని ఎల్​డీఎం గౌతం లక్ష్మీనారాయణ తెలిపారు. మాఫీ నిబంధనల ప్రకారం ఈ జాబితాల నుంచి అర్హులను ఎంపికచేసి లబ్ధిని చేకూరుస్తారని వివరించారు.

ఇవీచూడండి: మందు భామలం మేము.. క్యూ కడతాము..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.