ఈ సంవత్సరం కరోనా వ్యాప్తి కారణంగా.. వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం మూడు అడుగుల కంటే పెద్ద విగ్రహాన్ని పెట్టకూడదని నిబంధనలు విధించారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కోరుట్లలో కొంతమంది యూత్ సభ్యులు నిబంధనలకు కట్టుబడి కొన్ని వినూత్న విగ్రహాలను రూపొందించి.. వాటికి పూజలు చేస్తున్నారు.
పట్టణంలోని గ్రీన్ హోప్ యూత్ వారు తయారుచేసిన నెమలి పింఛాలతో తయారుచేసిన గణనాథుడిని ప్రతిష్ఠించారు. వినోభా ఫ్రెండ్స్ యూత్ వారు.. కరోనా నుంచి జాగ్రత్తలు తెలిపేలా.. మాస్క్ ధరించిన బాల గణేశుడిని నిలిపి పూజలు చేశారు. సిరిపురం సాయి తేజ అనే యువకుడు.. తన ఇంట్లో చెడిపోయిన కంప్యూటర్ సర్క్యూట్, విడి భాగాలతో, విద్యుత్ పరికరాలతో తయారు చేసిన వినాయకుడు ఎంతగానో ఆకర్షిస్తున్నాడు.