బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం వల్ల జగిత్యాల జిల్లాలో వైన్సుల ముందు మందుబాబులు బారులు తీరారు. మద్యం దొరుకుతుందో లేదోనని లాక్‌డౌన్ ప్రకటన అనంతరం వెంటనే మద్యం దుకాణాలకు చేరుకున్నారు.
ప్రజలు అవసరానికి మంచి మద్యం సీసాలను తీసుకెళ్తున్నారు. కొవిడ్ నిబంధనలను పలుచోట్ల గాలికొదిలేస్తున్నారు. జగిత్యాల పట్టణంతోపాటు కోరుట్ల, మెట్‌పల్లి తదితర ప్రాంతాల్లోని దుకాణాల వద్ద రద్దీ నెలకొంది.
ఇదీ చూడండి: లాక్డౌన్ను 10 రోజుల మించి పెంచకూడదు: అసదుద్దీన్