కరోనా కష్టాలతో కోరుట్ల కొట్టుమిట్టాడుతోంది. వైరస్ కాటుకు ప్రజలు బలవుతున్నారు. గత 20 రోజుల్లో సుమారు 80 మందికి వైరస్ సోకింది. నలుగురు మహమ్మారి కాటుకు బలికావడం ఆందోళన రేకెత్తిస్తోంది. కోరుట్ల పురపాలక సంఘం కో- ఆప్షన్ సభ్యుడు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరణించడం భయభ్రాంతులకు గురిచేస్తోంది.
కరోనా వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ... పట్టణంలోని వ్యాపారస్థులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ కూడా విధించుకున్నా... మహమ్మారి విజృంభిస్తోంది.