జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కొవిడ్-19పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాల వద్ద పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు మాస్క్‌లను ఉచితంగా పంపిణీ చేశారు.
ప్రతి విద్యార్థి బయటకు వెళ్లే సమయంలో తప్పకుండా మాస్క్ ధరించాలని సూచించారు. అలాగే ఇంటికి వచ్చినప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. అత్యవసర సమయంలో మాత్రమే బయట కు వెళ్లాలని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: సరిహద్దుల మూసివేతతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జాం