తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేస్తోన్న సమ్మె తొమ్మిదో రోజుకు చేరింది. ఈ మేరకు జగిత్యాల జిల్లా మెట్పల్లి ఆర్టీసీ డిపో ముందు కార్మికులు వినూత్న రీతిలో వంటావార్పు చేస్తూ ఆందోళన నిర్వహించారు. మహిళా ఉద్యోగులు సైతం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ కడుపు మంటను ప్రభుత్వానికి ఈ విధంగా చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి తమ సమస్యలకు పరిష్కారం చూపాలని.. లేకపోతే రానున్న రోజుల్లో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని అంటున్నారు.
ఇదీ చూడండి: ఆర్టీసీ సమ్మె: 19న తెలంగాణ బంద్