కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. భాజపా, తెరాస రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆరోపించారు. కొత్త చట్టాలతో కనీస మద్దతు ధర కోల్పోవాల్సి వస్తుందన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో సన్నవరి సాగుచేసిన రైతన్నలు పంటను పూర్తిగా నష్టపోయారని విమర్శించారు. దాదాపు 30 లక్షల ఎకరాల్లో మూడు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని జీవన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.